ETV Bharat / state

లాక్​డౌన్​ ఉన్నా.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటాడు..! - ఏపీలో లాక్​డౌన్ ఉల్లంఘన వార్తలు

లాక్​డౌన్​ నిబంధన అమల్లో ఉన్నా ఆ యువకుడు మూడు రాష్ట్రాలను దాటి తన సొంతూరికి చేరుకున్నాడు. అయితే మహారాష్ట్రలో పనిచేస్తున్న అతను ఇక్కడికి రావడంపై అధికారులు విస్మయానికి గురయ్యారు. యువకునికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తగా క్వారంటైన్​కు తరలించారు.

a young man lock down break  in guntur
a young man lock down break in guntur
author img

By

Published : Apr 27, 2020, 8:05 PM IST

మహారాష్ట్రలో పనిచేస్తున్న యువకుడు మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి గుంటూరు రావడం కలకలం రేపింది. గుంటూరు నగరంలోని బ్రాడిపేటకు చెందిన ఓ యువకుడు మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. లాక్​డౌన్ కారణంగా రవాణా సౌకర్యాలు లేక అక్కడి నుంచి వచ్చే వీలు లేకుండా పోయింది. అయితే తాను పని చేస్తున్న సంస్థకు చెందిన కంటైనర్ వాహనం హైదరాబాద్ వస్తుండటంతో అందులో అక్కడి వరకు వచ్చాడు. హైదరాబాద్ నుంచి వేరే రవాణా వాహనంలో విజయవాడకు చేరుకున్నాడు. గుంటూరు నుంచి ద్విచక్ర వాహనం తెప్పించుకుని.. దానిపై బ్రాడిపేటలోని తన ఇంటికి చేరుకున్నాడు. అయితే పొరుగు వారి ద్వారా విషయం వార్డు వాలంటీర్లకు తెలిసింది. వారు వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే యువకుని ఇంటికి చేరుకున్న అధికారులు, వైద్య సిబ్బంది అతనికి కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్​కు తరలించారు. లాక్​డౌన్ నిబంధనలు ఉన్నా.. మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటి యువకుడు రావడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

దేశంలో 872కు పెరిగిన కరోనా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.