గుంటూరు జిల్లా నాదెండ్ల మండలంలో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో.. ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మరణించగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ యువతిని తప్పించబోయి ట్రాక్టర్ డ్రైవర్, మూడు చక్రాల వాహనం బోల్తాపడి దివ్యాంగుడు ప్రమాదానికి గురికాగా.. వారిరువురిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
కళాశాల నుంచి తిరిగి వస్తుండగా...
వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొని.. చిలకలూరిపేటకు చెందిన బీటెక్ విద్యార్థి జ్ఞానేశ్వరరావు నిన్న సాయంత్రం మరణించాడు. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద ఈ ప్రమాదం జరిగింది. కళాశాల నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా.. ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలపాలైన బాధితుడిని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు.
యువతిని తప్పించబోయి...
డ్రైవర్ మీద నుంచి ట్రాక్టర్ ఇంజన్ వెళ్లడంతో.. చిలకలూరిపేట సుగాలికాలనీకి చెందిన భూక్యానాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. వేలూరు నుంచి పట్టణానికి వస్తుండగా.. సైకిల్‌పై వెళుతున్న ఓ యువతి జాతీయ రహదారి మీద పడిపోయింది. ఆమెను తప్పించబోయిన డ్రైవర్.. ట్రాక్టర్‌ను డివైడర్ ఎక్కించాడు. ఈ క్రమంలో వాహన చోదకుడు కిందపడిపోగా.. ఇంజన్ అతడి మీద నుంచి వెళ్లిపోయింది. చికిత్స నిమిత్తం డ్రైవర్‌ను గుంటూరు ఆస్పత్రికి తరలించారు.
వాహనం బోల్తాకొట్టి...
యడ్లపాడు మండలం తిమ్మాపురంకు చెందిన దివ్యాంగుడు కోడిరెక్క మరియదాసుకు.. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. మూడు చక్రాల మోటారు సైకిల్‌పై చిలకలూరిపేట నుంచి తిమ్మాపురం వెళుతుండగా.. సీఆర్ కళాశాల సమీపంలో వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: