ETV Bharat / state

లాక్​డౌన్​తో లాకైపోయిన పెద్దాయిన... సొంత రాష్ట్రానికి వెళ్లే మార్గం లేక భిక్షాటన - గుంటూరు జీజీహెచ్​ తాజా వార్తలు

తొమ్మిది పదుల వయసు... అనారోగ్యం.. అయినోళ్లు చెంతనలేరు... ఆసుపత్రిలో చేర్పించి అల్లుడెళ్లిపోయాడు. ఇంతలో లాక్​ డౌన్​. హాస్పిటల్ నుంచి బయటకొచ్చిన ఆ పెద్దాయనకు తోడు నీడా రెండూ లేవు. సొంత రాష్ట్రానికి వెళ్లే మార్గం లేక.. పొట్ట నింపుకోవటానికి భిక్షాటన మొదలుపెట్టాడు. కర్ణాటకకు చెందిన ఓ ముసలితాత ఎదుర్కొంటున్న ఈ దీనగాథ పై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

లాక్​డౌన్​తో లాకైయినపో పెద్దాయిన.
లాక్​డౌన్​తో లాకైయినపో పెద్దాయిన.
author img

By

Published : Sep 4, 2020, 3:05 PM IST

కర్ణాటక రాష్ట్రం హుబ్బిళి జిల్లా ధరోజీ గ్రామం వద్ద దేవసముద్రం అనే ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ ఉండే వీరస్వామి (92).. కంటిలో శుక్లాలు తీయించుకునేందుకు అల్లుడితో కలిసి మార్చిలో గుంటూరు జీజీహెచ్​కు వచ్చాడు. వైద్యులు 20 రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పగా.. వీరస్వామిని అల్లుడు జీజీహెచ్​లోనే వదిలేసి మహారాష్ట్రకు వెళ్లిపోయాడు.

ఇంతలో కరోనా కారమంగా లాక్​డౌన్​ ప్రకటించారు. ఏం చేయాలో తెలియక ఓ బ్యాగ్​ పట్టుకుని 5నెలలుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు వీరస్వామి. ఈ వయసులో కూడా ఆ పెద్దాయన తన ఊరిపేరును, ఇతర వివరాలను స్పష్టంగా చెప్పగలుగుతున్నాడు. లారీల ద్వారా వెళ్దామంటే కరోనాకు భయపడి ఎవరూ ఎక్కించుకోవటం లేదని వాపోతున్నాడు. ప్రస్తుతం అమరావతి రోడ్డులో ఉన్న హోసన్న మందిరం వద్ద భోజనం చేస్తూ అక్కడే సేద తీరుతున్నాడు.

ఇదీ చూడండి:

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం- ఆపై గొంతు కోసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.