గుంటూరు సర్వజనఆసుపత్రిలో వైద్యులు అరుదైన చికిత్స నిర్వహించారు. ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన 75 ఏళ్ళు రంగమ్మ అనే వృద్ధురాలికి స్టంట్ తర్వాత పేస్ మేకర్ అమర్చరారు. ఈ విదమైన శస్త్రచికిత్స చేయటం ఈ ఆసుపత్రిలో ఇదే మెుదటిసారి. గుండె వైద్య నిపుణులు డాక్టర్ ఎన్. శ్రీకాంత్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి మొదట రక్తనాళానికి స్టంట్ వేశారు. అనంతరం పేస్ మేకర్ సర్జరీ నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావటం పట్ల డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టర్స్ డే రోజు రంగమ్మ ఆరోగ్యంగా ఇంటికి వెళ్లడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఇదీచదవండి