గుంటూరు ఏటీ అగ్రహరం 16వ లైన్లోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు... పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన పెంచుకొని చైతన్యం కలిగిస్తున్నారు. ఉపాధ్యాయులు తరచూ చెప్పే పాఠాలు శ్రద్ధగా విని... సమాజ శ్రేయస్సుకు ముందుకు కదిలారు. సామాజిక స్పృహ, విశాలమైన ఆలోచనలకు అద్దంపట్టేలా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.
ఓ వైపు పాఠాలు నేర్చుకుంటూనే... పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించారు. విద్యార్థులంతా ఏకమై పాఠశాల ఆవరణతోపాటు వీధి మొత్తాన్ని శుభ్రపరిచారు. రోడ్లపై ఉన్న చెత్త సేకరించి ఒకచోట వేశారు. పాఠశాల నుంచి ప్రధాన కూడలి వరకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు.
చదువుతోపాటు సామాజిక పరమైన అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమాలతో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచుతున్నట్టు తెలిపారు. మార్పుకోసం ఆలోచిస్తే సరిపోదు... ఒక్క అడుగైనా వేయాలీ అంటున్నారీ చిన్నారులు.
ఇదీ చదవండి: