గుంటూరు గ్రామీణ ప్రాంతానికి చెందిన బేతపూడి చిన్న రామయ్య గన్నవరం ఎయిర్ పోర్ట్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌గా పనిచేస్తున్నట్లు నకిలీ గుర్తింపు కార్డును సృష్టించాడు. మ్యాట్రిమోనీలో తన పేరుతో ఒక ఖాతాను తెరిచాడు. తన ప్రొఫైల్‌కు లైక్‌లు కొట్టిన మహిళలు ఫోన్ నంబర్లను సేకరించి వారికి ఫోన్ చేసేవాడు. వారికి పెళ్లి సంబంధాలు చూస్తానని, ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారిని నమ్మించాడు. ఇదే క్రమంలో కృష్ణా జిల్లా కైకలూరు పరిసర ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు అతని మాటలు నమ్మి బ్యాంకు అకౌంటుకు నగదు పంపారు. వారిలో ఓ యువతికి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి అందుకు కొంత నగదు ఇవ్వాలని కోరాడు. సదరు యువతి తన ఏటీఎం కార్డును మోసగాడికి ఇచ్చింది.
యువతి ఫిర్యాదుతో
ఇదే అదునుగా భావించిన మోసగాడు అక్కడి నుంచి ఉడాయించి నరసరావుపేటకు మకాం మార్చాడు. డబ్బు కావలసినప్పుడు యువతి ఏటీఎం కార్డు వాడటం మొదలుపెట్టాడు. తన ఖాతాలో డబ్బులు డ్రా చేస్తుండటంతో యువతికి అనుమానం వచ్చి కైకలూరు పోలీసులను ఆశ్రయించింది. విచారణ జరిపిన పోలీసులు సెల్ సిగ్నల్స్ ద్వారా నిందితుడిని కనుగొన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని కైకలూరు తరలించారు.
ఇదీ చూడండి: