ETV Bharat / state

'ప్రయాణంలో ఆభరణాలు పోయాయి..ఎయిరిండియా అధికారులు పట్టించుకోవడం లేదు' - ఎయిర్ ఇండియాపై ఫిర్యాదు చేసిన ప్రయాణికురాలు

ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేసిన సమయంలో.. తన లగేజీలో ఉన్న బంగారు వస్తువు చోరీకి గురైనట్లు ఓ ప్రయాణికురాలు ఆరోపించారు. మూడు నెలలుగా అనేక ఫిర్యాదులు చేసినా స్పందించటం లేదని వాపోయారు.

passenger  Lakshmi Priya
ప్రయాణికురాలు లక్ష్మీ ప్రియ
author img

By

Published : Apr 25, 2021, 10:34 AM IST

ప్రయాణికురాలు లక్ష్మీ ప్రియ

ప్రయాణికుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న ఎయిర్ ఇండియా సంస్థపై గుంటూరు జిల్లా తెనాలికి చెందిన ఓ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్ష్మీ ప్రియ అనే ప్రయాణికురాలు విజయవాడ నుంచి వారణాసి వెళ్లే క్రమంలో ఎయిర్ ఇండియాలో ప్రయాణం చేశారు. ఆ సమయంలో తన లగేజీలో ఉన్న బంగారు వస్తువులు అపహరణకు గురైనట్లు ఆమె చెప్పారు. ఘటన గురించి వారణాసి, ఢిల్లీ, విజయవాడ ఎయిర్​ పోర్ట్​లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మూడు నెలలుగా అనేక ఫిర్యాదులు చేసినా సమస్యపై స్పందించటం లేదని ఆమె వాపోయారు. ఈ విషయంపై ప్రశ్నిస్తే ఆ సంస్థ అర్థం లేని సమాధానం చెబుతున్నారని ఆమె ఆరోపించారు.

ఇదీ చదవండీ.. తిరుపతిలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.