గత రెండేళ్లుగా ఓ యువకుడు తనను లైంగికంగా వేధిస్తున్నాడని గుంటూరుకి చెందిన ఓ వివాహిత వాపోయింది. 2017లో పోలీసులకు ఫిర్యాదు చేసి..కేసు పెట్టిన యువకుడు ఇంకా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే వివాహిత తన భర్తతో విడాకులు తీసుకుని కొన్నేళ్లుగా విడిగా ఉంటుంది. శుభకార్యాలలో వంటకాలు చేసుకుంటూ జీవనం సాగిస్తూ.. తన ఇద్దరి ఆడపిల్లలను పోషిస్తుంది. ఒంటరిగా ఉంటున్న ఆమె పై గుంటుపల్లి రమేశ్ అనే యువకుడు కన్నుపడింది. గత కొన్నేళ్లుగా రామకృష్ణ తనను లైంగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు వివరించింది.
తాను ఇంటిలో లేని సమయంలో తన కుమార్తెలతో అస్యభంగా ప్రవర్తిస్తున్నాడని ఆమె చెప్పింది. ఇదే విషయం పై 2017లో గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసి బైండొవర్ చేశారు. ఆయిన్పటికి రామకృష్ణ పద్ధతి మార్చుకోలేదని నిత్యం తన స్నేహితులతో కలిసి ఇంటిలోనే మద్యం సేవిస్తున్నాడని.. బయట చెబితే చంపుతామని బెదిరిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవీ చదవండి...సరోగసి పేరుతో సరసమాడాడు..