గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మయూరి అనే మహిళకు 5 సంవత్సరాల క్రితం వివాహమయ్యింది. అయితే నిన్న రాత్రి అత్తారింటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త వేధింపులు వల్లే మరణించిందని మృతురాలి పుట్టింటి వారు అనుమానం వ్యక్తం చేశారు. అత్తంటి వారే హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: