గుంటూరు ఆరండేల్‌పేటలో సుబ్రమణ్యం.... వెదురు కర్రతో కళాఖండాలు తయారు చేస్తున్నారు. వెదురు బొంగుకు కొత్త హంగులు అద్ది జీవనోపాధి పొందుతున్నారు. 30 ఏళ్ల కిందట తమిళనాడు నుంచి వలస వచ్చిన ఆ పెద్దాయన... ఓ గురువు దగ్గర నేర్చుకున్న విద్యను ఉపాధిమార్గంగా ఎంచుకున్నారు. తనకున్న వైవిధ్యమైన ఆలోచలనలతో ఈపిల్ టవర్, టైటానిక్ షిప్, హంస వాహనం... ఇలా వేల కొద్ది భిన్న కళా రూపాలకు జీవం పోస్తున్నారు. చదవుకోకపోయినా సునిశిత పరిశీలన, ఏకాగ్రతతో భిన్నమైన కళాఖండాలు తయారుచేస్తున్నారు.
ఆతని చేతుల్లోనుంచి అవిష్కృతమైన బొమ్మలు.... గుంటూరులోని ఎన్నో ఇళ్లల్లో కొలువు దీరాయి. దీనిపై పెద్దగా ఆదాయం లేకున్నా ఆయన ఏనాడూ కుంగిపోలేదు. కళను బతికించాలన్న తపనతోనే ముందుకెళ్తున్నారు. నేర్చుకున్న విద్యను పదిమందికి చేర్చాలన్న ఆశయంతో విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తారు సుబ్రమణ్యం.
ఆరండల్‌పేటలో సొంత దుకాణం లేని సుబ్రమణ్యానికి చిత్రకారుల సంఘం ఆదరించి.. ఆశ్రయమిచ్చింది. ఆ చిన్న దుకాణంలోనే ఈ వెదురుబొమ్మల కళాకారుడు... సరికొత్త ఆకృతులు సృష్టిస్తూ... కళాభిమానుల్ని ఆకర్షిస్తున్నారు. పడవ ఆకృతిలో ఎక్కువగా బొమ్మలు సృష్టించిన ఆయన పేరు పడవల సుబ్రహ్మణ్యంగా మారిపోయింది.
చాలీచాలని ఉపాధితో ఓవైపు కష్టాలు ఎదుర్కొంటున్నా.... కళను బతికించాలన్న సుబ్రమణ్యం తపన ఆందరిని ఆకట్టుకుంటోంది.
కష్టాల కడలిలో 'వెదురీ'దుతున్న కళాకారుడు
కలలో చూసిన అందానికైనా తన కళతో రూపాన్ని ఇవ్వగలడు అతడు. ఈఫిల్ టవరైనా, టైటానిక్ షిప్పునైనా వెదురుతో తయారు చేయగలడు. నిరక్ష్యరాసుడైనప్పడికీ ఎంతో మంది విద్యార్థులకు వేణుకళలో మెళకువలు నేర్పుతున్నాడు. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకున్నా కళను బ్రతికించాలన్న తపనతో తన వృత్తితోనే ముందుకు సాగుతున్నాడు.
గుంటూరు ఆరండేల్‌పేటలో సుబ్రమణ్యం.... వెదురు కర్రతో కళాఖండాలు తయారు చేస్తున్నారు. వెదురు బొంగుకు కొత్త హంగులు అద్ది జీవనోపాధి పొందుతున్నారు. 30 ఏళ్ల కిందట తమిళనాడు నుంచి వలస వచ్చిన ఆ పెద్దాయన... ఓ గురువు దగ్గర నేర్చుకున్న విద్యను ఉపాధిమార్గంగా ఎంచుకున్నారు. తనకున్న వైవిధ్యమైన ఆలోచలనలతో ఈపిల్ టవర్, టైటానిక్ షిప్, హంస వాహనం... ఇలా వేల కొద్ది భిన్న కళా రూపాలకు జీవం పోస్తున్నారు. చదవుకోకపోయినా సునిశిత పరిశీలన, ఏకాగ్రతతో భిన్నమైన కళాఖండాలు తయారుచేస్తున్నారు.
ఆతని చేతుల్లోనుంచి అవిష్కృతమైన బొమ్మలు.... గుంటూరులోని ఎన్నో ఇళ్లల్లో కొలువు దీరాయి. దీనిపై పెద్దగా ఆదాయం లేకున్నా ఆయన ఏనాడూ కుంగిపోలేదు. కళను బతికించాలన్న తపనతోనే ముందుకెళ్తున్నారు. నేర్చుకున్న విద్యను పదిమందికి చేర్చాలన్న ఆశయంతో విద్యార్థులకు మెళకువలు నేర్పిస్తారు సుబ్రమణ్యం.
ఆరండల్‌పేటలో సొంత దుకాణం లేని సుబ్రమణ్యానికి చిత్రకారుల సంఘం ఆదరించి.. ఆశ్రయమిచ్చింది. ఆ చిన్న దుకాణంలోనే ఈ వెదురుబొమ్మల కళాకారుడు... సరికొత్త ఆకృతులు సృష్టిస్తూ... కళాభిమానుల్ని ఆకర్షిస్తున్నారు. పడవ ఆకృతిలో ఎక్కువగా బొమ్మలు సృష్టించిన ఆయన పేరు పడవల సుబ్రహ్మణ్యంగా మారిపోయింది.
చాలీచాలని ఉపాధితో ఓవైపు కష్టాలు ఎదుర్కొంటున్నా.... కళను బతికించాలన్న సుబ్రమణ్యం తపన ఆందరిని ఆకట్టుకుంటోంది.
Body:ఇసుక లారీలు పట్టివేత
Conclusion:8008574248.