గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం యలమంద శివారులో.. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి దహనం చేశారు. మృతుడు వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన మాజీ ఎంపీపీ నాగరాజుగా పోలీసులు గుర్తించారు. నాగరాజు కనిపించడం లేదంటూ ఈనెల 21న.. అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా యలమంద శివారులో నాగరాజు మృతదేహాన్ని గుర్తించారు.
నాగరాజుకు ముస్లిం అమ్మాయితో ప్రేమ వివాహం
నరసరావుపేటకు చెందిన ఒక ముస్లిం అమ్మాయితో.. నాగరాజుకు ప్రేమ వివాహమైందని సీఐ భక్తవత్సలరెడ్డి తెలిపారు. ఆ అమ్మాయి 2016 లో మృతిచెందింది. అప్పటినుంచి ఆ అమ్మాయి కుటుంబానికి.. నాగరాజు కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఆ విషయంలో ఈ హత్య జరిగిందా.. లేదా ఇంకేమైనా కారణాలున్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు.హంతకులను పట్టుకొని.. చట్టప్రకారం శిక్షిస్తామన్నారు.
ఇదీ చదవండి: నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిపై కిడ్నాప్ కేసు