మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో చల్లా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ పేరుతో రవీంద్రా రెడ్డి వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన సంస్థ నుంచి ముప్పాళ్ల మండలం గొల్లపాడులో కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ డ్రగ్ హౌస్కు కాటన్ బండిల్స్ నాలుగు సంవత్సరాలుగా సరఫరా చేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి సుమారు 14 లక్షల 58 వేల 650 రూపాయలు కోడెల కుమార్తెకు చెందిన సంస్థ బకాయి పడినట్లు తెలిపారు. 11 నెలలుగా వీటిని చెల్లించలేదని చెప్పారు. తమ మార్కెటింగ్ మేనేజర్ పోతురాజు, వాసుదేవరావు, శ్రీనివాసరావులతో కలిసి నరసరావుపేటలోని కోడెల నివాసంలో బకాయి గురించి విజయలక్ష్మిని కలిశామని రవీంద్ర వెల్లడించారు. డబ్బు చెల్లించాలని కోరగా అనుచరులతో తనపై విజయలక్ష్మి దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.
మాజీ సభాపతి కోడెల కుమార్తెపై ఫిర్యాదు - kodeal daughter
తెదేపా నేత కోడెల శివప్రసాద్ కుమార్తెపై తెలంగాణకు చెందిన ఓ వ్యాపారి నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై ప్రశ్నించగా విజయలక్ష్మి అనుచరులతో దాడి చేయించారని ఆయన ఆరోపించారు.
మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు కుమార్తె విజయలక్ష్మిపై గుంటూరు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ పోలీస్స్టేషన్లో చల్లా రవీంద్రా రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో వెంకటేశ్వర సర్జికల్ కాటన్ మ్యానుఫ్యాక్చరర్స్ పేరుతో రవీంద్రా రెడ్డి వ్యాపారం నిర్వహిస్తున్నారు. తన సంస్థ నుంచి ముప్పాళ్ల మండలం గొల్లపాడులో కోడెల కుమార్తె నిర్వహిస్తున్న సేఫ్ డ్రగ్ హౌస్కు కాటన్ బండిల్స్ నాలుగు సంవత్సరాలుగా సరఫరా చేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి సుమారు 14 లక్షల 58 వేల 650 రూపాయలు కోడెల కుమార్తెకు చెందిన సంస్థ బకాయి పడినట్లు తెలిపారు. 11 నెలలుగా వీటిని చెల్లించలేదని చెప్పారు. తమ మార్కెటింగ్ మేనేజర్ పోతురాజు, వాసుదేవరావు, శ్రీనివాసరావులతో కలిసి నరసరావుపేటలోని కోడెల నివాసంలో బకాయి గురించి విజయలక్ష్మిని కలిశామని రవీంద్ర వెల్లడించారు. డబ్బు చెల్లించాలని కోరగా అనుచరులతో తనపై విజయలక్ష్మి దాడి చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు.
కంట్రీబ్యూటర్: టి. కిరణ్, నెల్లూరు సిటీ, 9394450291.
యాంకర్
నెల్లూరులో కలుషిత ఆహార అమ్మకాలపై కార్పొరేషన్ అధికారులు దాడులు కొనసాగుతున్నాయి. నగరంలోని పొదలకూరురోడ్డులోని పద్మావతి సెంటర్ ప్రాంతంలో కార్పొరేషన్ ఆరోగ్య అధికారి వెంకటరమణ ఓ చికెన్ దుకాణంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో దాదాపు 300 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించారు. ఫ్రీజర్ లో భారీగా నిల్వ ఉంచిన చికెన్ పట్టుబడటంతో కార్పొరేషన్ కమిషనర్ మూర్తి సంఘటనా స్థలానికి చేరుకుని నిల్వ ఉంచిన మాంసాన్ని నిర్వీర్యం చేశారు. అధికారులు దాడులు కొనసాగిస్తున్న వ్యాపారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు ఇంకా పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఆహార పదార్థాల్లో అమ్మకాలు సాగించిన హోటల్స్, దుకాణాలపై నిరంతర నిఘా ఉంటుందని, నిల్వ ఉంచిన ఆహారాన్ని అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.Body:కిరణ్ ఈటీవీ భారత్Conclusion:9394450291