ప్రేమ కోసం... ప్రేమించిన అమ్మాయి కోసం ఓ యువకుడు పెట్రోల్ బాటిల్తో హల్చల్ చేశాడు. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన వినోద్ అదే పట్టణానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవటంతో గురువారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు వారిద్దరూ చిక్కటంతో... యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు.
తామిద్దరమూ మేజర్లమని.. మా ఇద్దరిని వేరు చేయాలని యువతి తల్లిదండ్రులు చూస్తున్నారని వినోద్ సత్తెనపల్లి సెంటర్లో పెట్రోల్ బాటిల్తో ఆందోళనకు దిగాడు. యువతితో వివాహం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. పోలీసులు కూడా అమ్మాయి తల్లిదండ్రులకే మద్దతిస్తున్నారని ఆరోపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆ యువకుడిని స్టేషన్కు తరలించారు.