A common man's struggle : పన్ను బకాయి నెపంతో గుంటూరు మున్సిపల్ కాంప్లెక్స్ లో ఓ దుకాణాన్ని అధికారులు సీజ్ చేశారు. అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా షాప్ సీజ్ చేయడంతో తను పడుతున్న ఆర్థిక ఇబ్బందులు చూడలేక తల్లి గుండెపోటుకు గురైందని బాధితుడు వాపోయాడు. ఆస్తి పత్రాలు, క్రెడిట్ కార్డులు కూడా దుకాణం లోపలే ఉండిపోవడంతో తల్లికి వైద్యం చేయించలేకపోయానని తెలిపాడు.
అధికారులే కారణమంటూ : తన తల్లి మరణానికి గుంటూరు నగరపాలక సంస్థ అధికారులే కారణమంటూ.. వారు చేసిన పనికి తన తల్లికి వైద్యం కూడా చేయించలేకపోయానంటూ ఓ బాధితుడు కలెక్టర్ స్పందనలో అధికారులకు మొరపెట్టుకున్నాడు. గుంటూరు నగరానికి చెందిన వి.వెంకటేశ్వరరావు నాజా కాంప్లెక్స్లోని మున్సిపల్ దుకాణాన్ని ఆక్షన్ ద్వారా పొంది 2006 నుంచి కళ్ళజోడు దుకాణం నడుపుతున్నాడు. 2019 వరకు అన్ని చెల్లింపులు చేశానని తెలిపాడు. గతేడాది డిసెంబర్ లో అధికారులు వడ్డీ వ్యాపారుల మాదిరిగా ఉదయం 6 గంటలకే దుకాణాన్ని నోటీసు లేకుండా సీజ్ చేశారన్నారు. ఆ మనోవేదనతో తల్లి మరణించిందని.. డబ్బులు, బ్యాంకు కార్డులు అన్ని దుకాణంలోని ఉండటంతో తల్లికి కూడా వైద్యం చేయించలేకపోయానని ఆవేదన చెందాడు. అసలు, వడ్డీ కలిపి నాలుగు లక్షలా డెభ్బై వేలు చెల్లించాలని డిమాండ్ చేశారని, లేకుంటే వడ్డీ విధిస్తామని అధికారులు చెప్పినట్లు వెల్లడించాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఇవీ చదవండి :