ముక్కుపచ్చలారని చిన్నారిపై దుండగులు అత్యాచారానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం బోదనంపాడులో చోటుచేసుకుంది. ఏడు నెలల చిన్నారిని కన్నతల్లి రాత్రి ఊయలలో వేసి నిద్రపుచ్చింది. ఉదయాన్నే చూస్తే పాప కనిపించలేదు. ఆందోళన చెందిన తల్లి పాప కోసం చుట్టుపక్కల అంతా వెతికింది. ఇంటికి కొద్దీ దూరంలోని నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడిఉన్న పాపను స్థానికులు చూశారు. విషయం తెలుసుకున్న ఆ తల్లి బోరున విలపిస్తూ వెళ్లింది. చిన్నారి పెదాలు, మర్మాంగాలపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే పాపను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసిన పలు కోణాల్లో విచారిస్తున్నారు.
ఇదీ చదవండి.. ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు