గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో యశ్వంత్(8) అనే బాలుడు ఈ నెల 17 రాత్రి నుంచి కనిపించడం లేదని అతని తల్లి లక్ష్మి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. లక్ష్మి కొంతకాలంగా పల్లెపు వీరాస్వామితో సహజీవనం సాగిస్తోంది. వీరాస్వామి బైక్పై రెండు రోజుల క్రితం వెళ్లగా అప్పటినుంచే యశ్వంత్ కనిపించడం లేదని తెలుస్తోంది. అతడే చిన్నారిని కొట్టి… మూటకట్టి… ద్విచక్రవాహనంపై పెట్టుకొని పరారైనట్లు గ్రామస్థులు అనుమానిస్తున్నారు. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు నాదెండ్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రత్యేక పోలీసు బృందం యశ్వంత్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది.
ఇవీ చదవండి: గంటలోనే రేషన్ కార్డు.. ప్రయోగం విజయవంతం