గుంటూరు జిల్లాలో తాజాగా 470 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 92 గుర్తించారు.
మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు.
రేపల్లె-55, అమరావతి-20, మంగళగిరి-35, పెదకాకని-14, తాడికొండ-16, దాచేపల్లి-14, చిలకలూరిపేట-14, నాదెండ్ల-14, నరసరావుపేట-18, నకరికల్లు-18, కకుమాను-14, తెనాలి-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
వైరస్ ప్రభావంతో..
జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54 వేల 029 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో కొత్తగా ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 557కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.