- గ్రామ సౌకర్యాలపై ప్రశ్నించిన జవాన్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి అసహనం.. వీడియో వైరల్
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గుడ్‌మార్నింగ్ కార్యాక్రమంలో భాగంగా సత్యసాయి జిల్లాలోని గొట్లూరు గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యేని ఓ ఆర్మీజవాన్ నిలదీశారు. దీంతో కేతిరెడ్డి అసహనానికి గురైయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పంపిణీ జాప్యంతో.. అన్యాక్రాంతమవుతోన్న టిడ్కో ఇళ్ల ముడిసరుకులు
ప్రభుత్వ జాప్యంతో టిడ్కో ఇళ్ల పరిస్థితి దారుణంగా మారుతోంది. నిర్మాణ స్థితిలో ఉన్న టిడ్కో ఇళ్ల పర్యవేక్షణ సరిగా లేక నిర్మాణ సామాగ్రి పనికి రాకుండా పోతొంది. టిడ్కో నివాసాల పరిస్థితిపై మరింత సమాచారం మా ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏ ఓ బీ సరిహద్దులో భారీగా మావోయిస్టు సానుభూతిపరుల లోంగుబాటు..
ఆంధ్రా ఒడిశా సరిహద్దులో భారీ స్థాయిలో మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు లొంగిపోయారు. లోంగిపోయినవారిలో ఆంధ్రా ఒడిశా రెండు రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలోని మావోయిస్టు సానుభూతిపరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అయ్యప్ప పడిపూజను అడ్డుకున్న పోలీసులు.. కారణం ఏంటంటే??
రాష్ట్రంలో పలు రాజకీయ నాయకుల పర్యటనలు, సభలు నిర్వహించడానికి.. ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోలేదనే కారణంతో వాటిని నిలిపివేసిన ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా దేవుడికి సంబంధించిన పూజలు నిర్వహించడానికి కూడా అనుమతి తీసుకోలేదనే కారణంతో పూజను అడ్డుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుటుంబంలోని నలుగురిని హత్య చేసిన బాలుడు.. అంతు చిక్కని కారణం!
13 ఏళ్ల బాలుడు తన కుటుంబంరలోని నలుగురిని హత్య చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అతడి కోసం గాలించి పట్టుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉమ్మడి పౌర స్మృతి అమలు.. అమ్మాయిలకు సైకిళ్లు, స్కూటర్లు, రిజర్వేషన్.. భాజపా హామీల జల్లు
హిమాచల్ ప్రదేశ్‌లో మహిళా ఓటర్లే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది భాజపా. ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని మరోమారు తెరపైకి తెచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వాతావరణ మార్పులను ఈసారైనా 'కాప్' కాస్తారా?
ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సవాళ్లలో వాతావరణల మార్పులు ఒకటి. ఈ మార్పులతో ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు అధికమవుతున్నాయి. వీటిని అధిగమించడంపై ఈజిప్ట్‌లో కాప్-27 సదస్సు జరగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సుకు బైడెన్ సహా అనేకమంది దేశాధినేతల హాజరు కానున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- '8 డాలర్లకే బ్లూటిక్' సేవలు ప్రారంభం .. త్వరలోనే భారత్‌లో సైతం..!
ట్విట్టర్‌ను హస్తగతం చేసుకున్న టెస్లా సీఈఓ ఎలన్ మస్క్.. అభివృద్ధి పనుల్లో భాగంగా ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ క్రమంలో ట్విట్టర్ సబ్‌స్క్రిప్షన్‌ను 7.99 డాలర్లకు అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాజకీయ పిడికిట్లో భారత క్రికెట్.. ఆటకు తిరోగమనం తప్పదా?
ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డయిన బీసీసీఐకి కొత్త అధ్యక్షుడు వచ్చారు. బీసీసీఐ కార్యవర్గంలోనూ మార్పులు జరిగాయి. దాని వెనక పెద్ద రాజకీయమే నడిచిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బీసీసీఐ పూర్తిగా రాజకీయ నేతల చేతుల్లోకి వెళ్తోందని క్రికెట్ అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విమర్శలపై 'ఆదిపురుష్' టీమ్ వర్కౌట్.. రూ.100 కోట్లు ఖర్చుపెట్టి రీషూట్?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆదిపురుష్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ విమర్శలు వచ్చాయి. వాటిపై చిత్ర యూనిట్ దృష్టి సారించినట్లు సమాచారం. అయిేత ఈ సినిమా విడుదల మంరింత ఆలస్యం కానుంది. కారణం ఏంటంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.