ETV Bharat / state

జిల్లాలో 382కి చేరుకున్న పాజిటివ్ కేసులు

author img

By

Published : May 11, 2020, 12:45 PM IST

గుంటూరు జిల్లాలో మరో 6 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి జిల్లా వ్యాప్తంగా కేసుల సంఖ్య 382కి చేరింది. ఇప్పటివరకూ జిల్లాలో చికిత్స పొంది కోలుకున్న 176 మంది ఆస్పత్రుల నుంచి ఇళ్లకు వెళ్లారు.

జిల్లాలో 382కి చేరుకున్న పాజిటివ్ కేసులు
జిల్లాలో 382కి చేరుకున్న పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లాలో తాజాగా నమోదైన 6 పాజిటివ్ కేసులతో కలిసి జిల్లా వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 382కి చేరింది. తాజాగా నమోదైన 6 కేసుల్లో నరసరావుపేట, గుంటూరు, తాడేపల్లి ప్రాంతాల్లో రెండేసి చొప్పున నమోదయ్యాయి. ఇవన్నీ కంటైన్మెంట్ జోన్లలోనే కావటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 382 కేసులు నమోదు కాగా... అందులో 176 మంది కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు.

మరో 198 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 8 మంది మృతిచెందారు. తాజా కేసులతో ఇప్పటివరకు నరసరావుపేటలో 165 కేసులు, గుంటూరులో 161 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే లక్ష్యంతో మిషన్​ మే-15 పేరుతో కేసుల కట్టడికి అధికారులు కృషి చేస్తున్నారు. పూర్తిస్థాయి లాక్​డౌన్​ను ఈనెల 13 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

వార్డుల వారీగా నిత్యావసర సరకులను సరఫరా చేస్తామని... ఎవరూ ఇళ్లు విడిచి బయటకు రావొద్దని ఆర్డీవో వెంకటేశ్వర్లు కోరారు. మిర్చి కోతల కోసం వచ్చి మేడికొండూరు, ఫిరంగిపురం ప్రాంతాల్లో చిక్కుకుపోయిన కర్ణాటక, ప్రకాశం, గుంటూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వలస కూలీలను నిన్న రాత్రి 62 బస్సుల ద్వారా అధికారులు తరలించారు. జిల్లాకు విదేశాల నుంచి వస్తున్న వారి కోసం హోటళ్లలో క్వారంటైన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు.

ఇదీ చూడండి:

చిత్తూరు జిల్లాలో మరో 16 మందికి కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.