గుంటూరు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా తాడికొండలో ఒకరికి రాగా... ఇదే మండల పరిధిలోని పొన్నెకలులో ఇద్దరూ వైరస్ బారినపడ్డారు. తాడికొండకు చెందిన మహిళ కొద్ది రోజులుగా జలుబు, దగ్గుతో బాధపడుతోంది. చికిత్స నిమిత్తం గుంటూరు ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. పరీక్షలు చేయగా.. ఇవాళ పాజిటివ్ అని రిపోర్టులో వచ్చింది. పొన్నెకలులో ఇద్దరికి వైరస్ నిర్ధారణ కావటంతో... గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేశారు. బాధితులను కొవిడ్ ఆస్పత్రులకు తరలించారు.
ఇదీ చదవండి: