గుంటూరు జిల్లా చిలకలూరిపేట మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే విడదల రజని పాదయాత్ర ముగింపు సందర్భంగా 25 వేల కార్తీక దీపాలను వెలిగించారు. ప్రభుత్వ పథకాలు కనిపించేలా మహిళలు దీపాలను ఏర్పాటు చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా కార్తీక దీపాలు వెలిగించి ప్రభుత్వానికి మద్ధతు తెలిపారని ఎమ్మెల్యే అన్నారు.
తమ ప్రభుత్వంలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పేందుకు వెలుగుతున్న ఈ దీపాలే సాక్ష్యమని తెలిపారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లెద్దు చిన్న, వైస్ చైర్మన్ సింగారెడ్డి కోటిరెడ్డి, మాజీ చైర్మన్ విడదల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: