గుంటూరు జిల్లాలో 20 కంటైన్మెంట్ జోన్లు, 59 క్లస్టర్లు ఉన్నాయని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ వెల్లడించారు. నగరంలో 26వ డివిజన్ మినహా... మిగితావన్ని కంటైన్మెంట్ జోన్లుగా ఉన్నాయన్నారు. బఫర్ జోన్‌లో నిత్యావసరాల కొనుగోలుకు ఉదయం 6 గంటల నుంచి 9 వరకే సమయమిచ్చామని స్పష్టం చేశారు.
మాస్కు లేకుండా బయటకు రావద్దని జిల్లా ప్రజలకు పాలనాధికారి సూచించారు. కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి వాహనాలకూ అనుమతి లేదని తేల్చి చెప్పారు. మద్యం దుకాణాల వద్ద జనాలు గుమిగూడితే ఆ దుకాణాలు రద్దు చేస్తామని హెచ్చరిచ్చారు. మందు కోసం పక్క గ్రామాలకు వెళ్తే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి