ETV Bharat / state

మూడేళ్లలో 1763 మంది ఎన్నారైలు ఆత్మహత్య: కేంద్ర విదేశాంగ శాఖ

1763 NRIs committed suicide: గడిచిన మూడేళ్లలో 1763 మంది భారతీయులు వివిధ కారణాలతో విదేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటుకు నివేదించింది. 136 మంది మాత్రం పలు రకాల హింస, హత్యల్లో చనిపోయారని పేర్కొంది.

NRIs committed suicide
ఎన్నారై
author img

By

Published : Feb 10, 2023, 4:24 PM IST

Updated : Feb 10, 2023, 4:33 PM IST

1763 NRIs committed suicide: గడిచిన మూడేళ్లలో 1763 మంది భారతీయులు వివిధ కారణాలతో విదేశాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర విదేశాంగ శాఖ పార్లమెంటుకు నివేదించింది. 136 మంది మాత్రం పలు రకాల హింస, హత్యల్లో చనిపోయారని పేర్కొంది. మరో 1622 మంది భారతీయులు రోడ్డు ప్రమాదాల్లో, 686 మంది వృత్తిపరమైన ప్రమాదాల్లో మరణించినట్లు వెల్లడించింది. విదేశాల్లో జరుగుతున్న భారతీయుల మరణాలపై నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి మురళీధరన్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

విదేశాల్లోఉన్న భారతీయులరక్షణకు పటిష్ట చర్యలు..: విదేశాల్లో ఉన్న భారతీయుల రక్షణకు అన్ని రకాల పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పిన మంత్రి... అక్కడ ఉన్న రాయబార కార్యాలయాలు నిత్యం పని చేస్తున్నాయని, ఎలాంటి ఘటన జరిగినా.. స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరిపి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. గత మూడేళ్లలో 24,278 మంది భారతీయులు విదేశాల్లో మరణించినట్లు.. వీరి మరణాలు అన్ని సాధారణమైనవే కానీ ఎలాంటి కారణాలు లేవని లోకసభలో చెప్పారు. భారతీయులపై జరుగుతున్న దాడుల విషయంలో ఎప్పటికప్పుడు సంబంధిత దేశాల ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో లేవనెత్తుతున్నట్లు మంత్రి చెప్పారు. ప్రతి దేశంలోనూ.. భారతీయుల భద్రత విషయంలో, వారికి అవసరమైన సాయం అందించే అంశంలో కేంద్రం ప్రాధాన్యతగా తీసుకుని చర్యలు చేపట్టిందని.. వారి ప్రాణాలు ఎలాంటి హాని జరగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.

ఇవీ చదంవడి:

Last Updated : Feb 10, 2023, 4:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.