ETV Bharat / state

ఉపాధ్యాయుల బదిలీలు.. మూతపడిన 11 ప్రభుత్వ పాఠశాలలు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరు జిల్లా పల్నాడు వాసులకు ప్రభుత్వ పాఠశాలలే పెద్ద దిక్కుగా నిలుస్తాయి. జిల్లాకు మారుమూలగానున్న వెల్దుర్తి మండలంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆశించిన దానికంటే ఎక్కువగా ఉన్నా, ఉపాధ్యాయులు అందుబాటులో లేక సర్కారీ బడులు మూతపడే పరిస్థితి నెలకొంది. ఒకటి కాదు.. రెండు కాదు.. 11 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు 18 మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. వీరి స్థానంలో ఎవరూ రాకపోవడంతో బడులకు తాళాలు వేశారు.

government schools closed
మూతపడిన 11 ప్రభుత్వ పాఠశాలలు
author img

By

Published : Jan 24, 2021, 5:12 PM IST

గుంటూరు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని 41 ప్రభుత్వ పాఠశాలల్లో 149 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించాలి. అయితే తాజాగా బదిలీల తరువాత ప్రస్తుతం 70 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని 57 మండలాల పరిధిలో పరిశీలిస్తే అత్యంత వెనుకబడిన వెల్దుర్తి, బొల్లాపల్లి మండలాల వైపు వచ్చేందుకు ఉపాధ్యాయులు అయిష్టత చూపుతున్నారు. కొత్తగా డీఎస్సీ ద్వారా పోస్టింగ్‌ వచ్చిన తరువాత తప్పని పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చినా, కొంతకాలం కాగానే ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన నేపథ్యంలో చాలామంది ఉపాధ్యాయులు రెండేళ్లు, మూడేళ్లు పూర్తికాకుండానే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.

మిగిలినచోట్ల అదే దారి..

వెల్దుర్తి మండలంలో విధులు నిర్వహించే 18 మంది ఉపాధ్యాయులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయినా, వీరి స్థానంలో ఒక్కరూ కూడా రాకపోవడంతో గుడిపాడు, శివలింగాపురం, మిట్టమీదపల్లె, లోయపల్లి, దావుపల్లి, వజ్రాలపాడు, బొటుకులపాయతండా, సేవానాయక్‌తండా, గొట్టిపాళ్ల, మరసపెంట, జెండాపెంటతండా బడులు మూతపడ్డాయి. మిగతా పాఠశాలల్లోనూ ఉపాధ్యాయులు సగం మంది వెళ్లారు. మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల్లో 70 మందిలో 15 మంది మినహా, మిగిలినవారు ఉపాధ్యాయినులే. దీంతో వారిని నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల తండాలు, చెంచుకాలనీలకు డిప్యూటేషన్‌ మీద పంపేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు ఒకరిద్దరితో నడుస్తున్న పాఠశాలల్లో ఉన్న వారిని కదిలించే అవకాశం లేదు. దీంతో విద్యాశాఖ అధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకున్నారు.

వెల్దుర్తి మండలంలో ఉపాధ్యాయుల సమస్యపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. బదిలీల ద్వారా ఖాళీ అయిన స్థానాల్లో ఉపాధ్యాయులు వచ్చేలా విద్యాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్దుర్తి ఎంఈవో అల్లి సురేష్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం సర్కారు బడుల్లో విద్యార్థులు భారీగా చేరుతున్న నేపథ్యంలో విద్యా బోధనకు ఆటంకాలు లేకుండా అధికారులు చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: మాస్టర్స్​ అథ్లెటిక్స్​ ఫౌండర్​ శేషయ్యకు సన్మానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.