తెలంగాణలోని జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం శనివారం పేటకు వెళ్తే ఓ వృద్ధురాలు చలాకీగా తిరుగుతూ... ఎవరు మీరు.. ఎవరు కావాలి.. ఎందుకొచ్చారు? అనే ప్రశ్నలు వేస్తుంది. ఎవరు ఈ ముసలామే ఇంత చలాకీగా ఉంది మహా అయితే ఓ 70 ఏళ్లు ఉంటాయి అనుకుంటారు. కానీ... ఆమె వయసు వందకాదు బాబూ... నూరున్నొక్కేళ్లు. ఈ వయసులోనూ తన పనులు తానే చేసుకుంటూ.. ఈ బామ్మ ఆశ్చర్యపరుస్తోంది. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు ఇప్పటికే వృద్ధాప్యానికి చేరుకున్నారు. ఈమె మాత్రం ఆరోగ్యంగా ఉంది. వినికిడి లోపం గాని, దృష్టి సమస్యలు లేవు. ఆ రోజుల్లో తీసుకున్న ఆహారమే తన ఆరోగ్య రహస్యమంటోంది ఈ బామ్మ.
ఇదీ చూడండి: