ETV Bharat / state

Hospital: నిలిచిపోయిన ఆస్పత్రి నిర్మాణ పనులు.. స్థానికుల ఇబ్బందులు - నిలిచిపోయిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు తాజా వార్తలు

గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు అటకెక్కాయి. నిధుల కొరతతో గుత్తేదారులు.. నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. గుంటూరు - ప్రకాశం జిల్లాల మధ్య కీలకమైన ఈ ఆస్పత్రి నిర్మాణ పనులు పూరైతే తమకు సౌకర్యవంతంగా ఉండేదని రెండు జిల్లాల ప్రజలు చెబుతున్నారు.

100 beds hospital works stopped in chilakaluripeta
నిలిచిపోయిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు.. స్థానికుల ఇబ్బందులు
author img

By

Published : Nov 2, 2021, 3:29 PM IST

నిలిచిపోయిన వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు.. స్థానికుల ఇబ్బందులు

గుంటూరు జిల్లా చిలకలూరిపేట, ప్రకాశం జిల్లా పర్చూరు, అద్దంకి నియోజకవర్గాల ప్రజలు.. సరైన ప్రభుత్వాసుపత్రి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. 2001లో చిలకలూరిపేటలో 30 పడకల ఆస్పత్రిని నిర్మించారు. పెరిగిన రహదారి ప్రమాదాలు, ఆధునిక వైద్య సేవల అవసరాల రీత్యా.. ఈ ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని.. 2019 ఫిబ్రవరిలో.. శంకుస్థాపన చేశారు. 82 కోట్ల 57 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ప్రణాళిక రూపొందించి.. 15 నెలల్లోగా నిర్మాణం పూర్తిచేయాలని నిర్ణయించారు.

ఇప్పటివరకు భవనాలు మాత్రమే నిర్మించారు తప్ప.. ఫ్లోరింగ్, సీలింగ్, ఇతర పనులేవీ జరగలేదు. నిధులు విడుదల కాకపోవటం వల్ల.. గుత్తేదారులు పనులు మధ్యలోనే నిలిపేశారని స్థానికులు అంటున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు గుంటూరుకు వెళ్లాల్సి వస్తోందంటున్నారు. ఉన్న 30 పడకల ఆస్పత్రిలోనూ.. వైద్యులు లేక రోగులకు సరైన వైద్య సేవలు అందడం లేదని స్థానికులు చెబుతున్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించి.. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

CORONA: కాకినాడలో కరోనా కలకలం.. వసతి గృహంలోని వైద్య విద్యార్థులకు మహమ్మారి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.