ఇవాళ ఉదయం 8 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఓటాన్ అకౌంట్ బడ్డెట్(2019-20) కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ఉదయం 11.45 గం.లకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. అదేసమయంలో శాసన మండలిలో మంత్రి నారాయణ ప్రవేశ పెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే తాత్కాలిక బడ్డెట్లో 7 కీలక బిల్లులను సభముందుకు తీసుకురానుంది.
నేడు సభ ముందుకు రానున్న బిల్లులు
1. చుక్కల భూముల చట్ట సవరణ బిల్లు
2.పరిశ్రమల బిల్లు
3.పరిశ్రమల విభాగాల బిల్లు, కార్మిక చట్ట సవరణ బిల్లులు
4.అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు
5. ఇళ్ల నిర్మాణాలు, స్థలాల ఆక్రమణకు చెందిన బిల్లు
6.సింహాచలం నరసింహస్వామి దేవస్థానం బిల్లు
వీటితో పాటుగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సభలో చర్చించనున్నారు. అదే విధంగా వ్యవసాయం, అనుబంధ రంగాలపై సభలో లఘు చర్చ జరగనుంది. ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.