Youth Interest to Zumba Dance in Eluru : ఆహ్లదకరమైన వాతావరణంలో సంగీతం వింటూ నృత్యం చేస్తూ, జుంబాడ్యాన్స్‌తో బరువు తగ్గడంతో పాటు చక్కటి శరీరాకృతి, ఆరోగ్యాన్ని సొంతం చేసుకుంటున్నవారు ఎందరో. దీంతో ఒత్తిడి జయించేవాళ్లూ ఉన్నారు. పాట ఏదైనా వ్యాయామానికి అనుగుణంగా స్టేప్పులేయడమే జుంబా డ్యాన్స్. మహా నగరాలకే పరిమితమైన ఈ ఒరవడి ప్రస్తుతం ఏలూరుకు విస్తరించింది. దీంతో బరువు తగ్గడంతోపాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది.
ఎమ్మెల్యే జుంబా డాన్స్... కేరింతలతో హోరెత్తించిన హీరో సంపూర్ణేష్ బాబు
Zumba Dance for Weight Loss : నిజానికి బరువు తగ్గించుకోడానికి ఎన్నో మార్గాలున్నాయి. పరుగు, ఆటలు, ఈత కొట్టడం, సైకిల్ తొక్కడం, జిమ్‌కెళ్లడం ఇలా ఎన్నున్నా అవి కష్టంతో కూడుకున్నవే. పైగా వీటిలో కొన్ని ఆరుబయట, లేదా మైదానాల్లో చేయాల్సి ఉంటుంది. వీటితో బరువు తగ్గినా ఒత్తిడి దూరమౌవు తుందని చెప్పలేం. కానీ, వాటికి భిన్నంగా ట్రెండ్‌కి అనుగుణంగా సులువుగా బరువు తగ్గడంతో పాటు అందమైన శరీరాకృతి, ఒత్తిడి దూరం చేసేదే జుంబా డ్యాన్స్.
ఆహ్లాదకరమైన వాతావరణంలో సంగీతం వింటూ పాటకు అనుగుణంగా పాదాలు కదుపుతూ డ్యాన్స్ చేయడమే జుంబా ప్రత్యేకత. దీంతో రోజును హుషారుగా ప్రారంభించడంతో ఆ రోజంతా అదే ఉత్తేజంతో గడుపుతారు. జుంబాతో ఒళ్లు నొప్పులు రావడం, కీళ్లు పట్టేసినట్లు ఉండటం లాంటివి ఉండవు. - సుష్మ, జుంబా సెంటర్ నిర్వాహకురాలు
జిమ్ కేంద్రాల్లోలాగా జుంబాలో రోజూ ఒకే రకమైన వర్కౌట్లు ఉండవు. ఇందులో సల్సా, బెల్లీ, కుంబీయా, ఆర్జెంటీనా, టాంగో వంటి డ్యాన్సులుంటాయి. వీట్లో రోజుకి ఒక్కటి చేయిస్తూ ప్రతి రోజు ప్రత్యేకంగా ఉండేలా చూస్తాము. 40 నిమిషాలు ఆపకుండా జుంబా డ్యాన్స్ చేస్తే శరీరంలో రోజుకు 800 నుంచి వెయ్యి వరకు కేలరీలు తగ్గుతాయి. ఎలాంటి డైట్ లేకుండానే అది సాధ్యమౌతుంది. - అనిల్, జుంబా ట్రైనర్
జుంబా డ్యాన్స్ పదేళ్లు దాటిన వారు ఎవరైనా చేయవచ్చు. లాటిన్ డ్యాన్స్ ఆధారంగా దీన్ని తీర్చిదిద్దారు. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు శరీరంలో కొవ్వును తగ్గించుకోవచ్చని శిక్షకులు చెబుతున్నారు. జుంబా డ్యాన్స్‌తో బరువు తగ్గడంతో పాటు శరీరాకృతిలోనూ మార్పులు వచ్చాయి. - ప్రియ, ఐటీ ఉద్యోగి
వ్యాయామంతో పోలిస్తే జుంబా డ్యాన్స్ చాలా బాగుంది. బరువులు ఎత్తడం, కష్టపడటం లాంటివి ఉండవు. మహిళలు, వయసు పైబడిన వారూ సులువుగా చేయోచ్చు. - విజయ్, ఉద్యోగి
Zumba Dance Benefits : జుంబా డ్యాన్స్‌కు వయసుతో సంబంధం లేకపోవడంతో అన్ని వయసుల వారూ దీనిపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో పలువురు తమ శరీరాన్ని కష్టపెట్టకుండా బరువు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, నిత్యం ఒత్తిడితో సతమతమయ్యే వారు ఈ జుంబా కేంద్రాల ద్వారా తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడికి స్వస్తి పలుకుతున్నట్లు పలువురు చెబుతున్నారు.
ZUMBA DANCE WORLD RECORD: 75 మంది.. 75 పాటలు.. 75 నిమిషాలు.. రికార్డుల 'జుంబా డ్యాన్స్' ఇది!
ట్రెండ్‌కు అనుగుణంగా విదేశాలు, మహా నగరాలకే పరిమితమైన జుంబా కేంద్రాలు క్రమంగా ఆదరణ చూరగొంటున్నాయి. ఉరుకుల-పరుగుల మధ్య సాగే జీవనం ప్రయాణంలో వ్యాయామాన్నే మరిచిపోతున్న తరుణంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ మానసిక ప్రశాంతతను కలిగిస్తున్నాయి జుంబా సెంటర్లు.