YSR Rythu Barbarossa Founds: ముఖ్యమంత్రి జగన్.. నేడు ఏలూరు జిల్లా గణపవరంలో పర్యటించున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో గణపవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా నేతలు దగ్గరుండి పరిశీలించారు. స్థానిక మహాలక్ష్మి థియేటర్ సమీపంలో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేయడంతో పలు మార్గాల్లో వాహనాల రాకపోకలను దారి మళ్లించారు.
ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్ తొలివిడత నిధులు... రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేయనుంది. నాలుగో ఏడాది మొదటి విడతగా మేలో ఇచ్చే రూ. 7వేల 500 లకు గానూ.. రూ. 5వేల 500 చొప్పున బటన్ నొక్కి సీఎం జగన్ రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్ నిధులు మరో రూ. 2వేలు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
ఇదీ చదవండి: TRAIL RUN: ట్రయల్ రన్లో సీఎం కాన్వాయ్‌కు ప్రమాదం