పోలవరం ప్రాజెక్టు పనులను డబ్ల్యూ అండ్ పీ మెంబర్ కే.హోరా నేతృత్వంలో వివిధ విభాగాలకు చెందిన 14 మంది నిపుణుల కమిటీ సభ్యుల బృందం పరిశీలించింది.
ప్రాజెక్టులోని అంతర్ భాగాలైన స్పిల్వే, గేట్ల అమరిక, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, దెబ్బతిన్న డయాఫ్రం వాల్, పవర్ ప్లాంట్ టన్నల్స్ పనులతోపాటు ఛానల్ బండ్ పనులను పరిశీలించారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రాజెక్టులో జరుగుతున్న పనులు, వాటి నాణ్యత తదితర అంశాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
ఇవీ చూడండి