Electrocuted man died: ఏలూరు జిల్లా కలిదిండిలో విషాదం జరిగింది. పిల్లలను పాఠశాలకు తీసుకువెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి తండ్రి మృతి చెందారు. ఘటనలో ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. రవిశంకర్ తన పిల్లలు సత్యనారాయణ, భార్గవ్‌లను ఉదయం పాఠశాలకు తీసుకువెళ్తుండగా దుర్ఘటన జరిగింది. చుట్టుపక్కల వారు గమనించి వారిని ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే రవిశంకర్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పిల్లలకి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
ఇవీ చదవండి: