ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్ల చింతలపూడికి చెందిన సాంబశివరావు, పావని గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పగా.. యువతి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో 3 నెలల క్రితం పెద్దలను ఎదిరించి విజయవాడలో వివాహం చేసుకున్నారు. అనంతరం తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందని విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు యువతి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అప్పటినుంచి పావని సాంబశివరావు ఇంట్లోనే ఉంటుంది.
గత రాత్రి (సోమవారం) ఎం. నాగులపల్లి శివారులోని ఓ ఫ్యామిలీ రెస్టారెంట్‌కు సాంబశివరావు, పావని భోజనం చేసేందుకు వచ్చారు. అక్కడకు చేరుకున్న పావని తండ్రి, తమ్ముడు వీరిపై విచక్షణారహితంగా దాడి చేశారు. సాంబశివరావు చెవి కొరికి కర్రలతో దాడి చేసారు. చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ప్రేమ జంట ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు. తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి