- 'చిన్నారుల ప్రపంచం' రక్షించే బాధ్యత తల్లిదండ్రులదే..
బాలలు.. భావి భారత పౌరులు.. బంగారు భవితకు పునాదులు. ఇవన్నీ నిన్నటి మాటలు. నేడు గుడికెళ్తే మెట్లెక్కలేరు. మైదానానికి వెళ్తే పరిగెత్తలేదు. యోగా క్లాసులకు పంపితే వంగలేరు. కరాటే నేర్పిద్దామంటే.. పట్టుమని 10 నిమిషాలు నిలబడలేని పరిస్థితి. పిజ్జాలు బర్గర్లే నిజమైన ఆహారంగా గ్యాడ్జెట్లే అసలైన ఆటలుగా భావిస్తున్నరోజులివి. వాటికి తోడు మారుమాట్లాడలేని పసిపిల్లలపై ఎన్నో ఆఘాయిత్యాలు.. అత్యాచారాలు జరుగుతున్నా అమాయకంగా ఎదుగుతోంది నేటితరం చిన్నారి ప్రపంచం. ఇందుకు కారణాలు ఎన్నున్నా.. తల్లిదండ్రులు కారకులు కావొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఈటీవీ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా పెరిగిన పన్నులు..సతమతమవుతున్న సామాన్యుడు..
భారీగా పెరిగిన పన్నులు కట్టలేక సతమతమవుతున్న సామాన్యుడిపై కర్నూలు నగరపాలక అధికారులు బ్రహ్మాస్త్రం సంధించారు. వడ్డీల మీద వడ్డీలేసి వేలు, లక్షల్లో కట్టాలని నోటీసులు జారీ చేశారు. కొందరు సెటిల్‌మెంట్ చేసుకోగా.. మరికొందరు ఏ విధంగా చెల్లించాలో అర్థం కాక విలవిలలాడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- త్వరలోనే రైల్వే జోన్ ప్రక్రియ: జీవీఎల్
ప్రధాని విశాఖ పర్యటనకు ఒకరోజు ముందే రైల్వేజోన్ నిర్థారిస్తూ నోటిఫికేషన్ విడుదలైందని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహరావు తెలిపారు. రాయగడ జోన్, సౌత్ కోస్ట్ జోన్లకు 106 కోట్లు మంజూరు చేశారన్నారు. రైల్వే మంత్రి జోన్ ప్రధానకార్యాలయం ఎక్కడ నిర్మించాలో మంత్రి తనిఖీ కూడా చేశారన్నారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుందని జీవీఎల్ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇకపై ఒకే నెంబర్‌తో రెండు వాట్సాప్‌లు.. 256కి మించితే ఆటో మ్యూట్..
విసుగుపుట్టించే గ్రూపు నోటిఫికేషన్ల సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఈ ఫీచర్‌తోపాటు ఒకే నెంబర్‌తో రెండు వేర్వేరు ఫోన్లలో వాట్సాప్ సేవలు పొందేందుకు వీలుగా మరో ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మధుమేహ రాజధానిగా 'భారత్'.. దీన్ని జయించడం ఎలా?
మధుమేహం.. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజారోగ్య సమస్య. సరైన అవగాహన మాత్రమే ఈ వ్యాధిని జయించే తారక మంత్రం. ఏటా నవంబరు 14న నిర్వహించే ప్రపంచ మధుమేహ దినం సామాన్యులు సైతం డయాబెటిస్ గురించి అవగాహన పెంచుకోవడానికి తోడ్పడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!
సైన్యం అంటే ఉగ్రవాదులు నుంచి దేశానికి రక్షణ అందించడమే కాదు.. అన్నింటికి ముందుండి నడిపిస్తుందని మరోసారి రుజువుచేస్తోంది కశ్మీర్‌లోని భారత సైన్యం. అక్కడ ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. కశ్మీర్ యువత విద్యాభివృద్ధికి, ఉద్యోగాలు అందించడానికి ఎంతగానో కృషి చేస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 800 కోట్లకు ప్రపంచ జనాభా.. పుడమికి మరిన్ని కష్టాలు!
నవంబర్ 15 నాటికి ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకోనుంది. ఈ భూమి మీద ఉండే జనాభా మంగళవారానికి 800 కోట్లు దాటనుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తుంది. అయితే.. ప్రపంచ జనాభా రానురాను పెరుగుతుంటే మున్ముందు ప్రస్తుతం ఉన్నంత సౌకర్యవంతంగా జీవించగలుగుతామా అన్నది ప్రశ్నలా మారనుంది! మరో వైపు ఈ భారం ప్రకృతి వనరులపై పడి ఎన్ని విపత్తులకు దారి తీస్తుందో అన్న భయం లేకపోలేదు! పుడమికి మరిన్ని కష్టాలు తప్పేలా లేవు? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- టెలికాం కింగ్‌గా జియో.. అత్యంత బలమైన బ్రాండ్‌గా అవతరణ
దేశంలో డేటా విప్లవానికి నాంది పలికిన రిలయన్స్ జియో.. తాజాగా మరో ఘనత సాధించింది. భారత్‌లో అత్యంత బలమైన టెలికాం బ్రాండ్‌గా అవతరించింది. ఈ మేరకు ఆర్టీఏ అనే సంస్థ నివేదిక విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సరైన జట్టుకే ప్రపంచకప్.. మూడేళ్లలో రెండు కప్పులు కొట్టిన ఇంగ్లాండ్
ఓటమి నుంచే గెలుపు ప్రయాణం మొదలవుతుందని.. పరాభవమే గొప్ప పాఠాలు నేర్పుతుందనడానికి ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు సరైన నిదర్శనం. ఒక్క ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన.. ఆ జట్టు దృక్పథాన్నే మార్చింది. ఆడే విధానంలో.. ఆలోచనలో మార్పు తెచ్చింది. దూకుడు నేర్చిన జట్టు ప్రత్యర్థులపై కసిగా విరుచుకుపడడం ఆరంభించింది. భయం లేని ఆటతో.. బలమైన జట్టుతో అద్భుతాలు చేస్తోంది. మూడేళ్ల వ్యవధిలో రెండు ప్రపంచకప్‌లు గెలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆమె మోడల్ కాదురా బాబోయ్ పోలీస్ అంట ఇంతకీ ఈ అందగత్తె ఎవరంటే
ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాలో అలజడి రేపిందీ నీ చిరునవ్వు అని పాటందుకుంటున్నారు కొలంబియాకు చెందిన డయానా రమిరెజ్‌ను చూసిన నెటిజన్లు. అలాగని ఆమె ఏ హీరోయినో లేదంటే ఏ మోడలో అనుకుంటే పొరపడినట్లే ఎందుకంటే.. వృత్తి రీత్యా ఆమె ఒక పోలీసాఫీసర్. డ్యూటీలో ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటుందో నెట్టింట్లోనూ అంత సరదాగా పోస్టులు పెడుతుంటుందీ బ్యూటిఫుల్ కాప్. అందుకే సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. మరి ఇంత అందమైన మీరు హాయిగా ఏ మోడలింగో చేసుకోకుండా ఎందుకీ రిస్కీ జాబ్ అనడిగితే తనేమంటుందో తెలుసా పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.