- IT RAIDS : వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు
వైసీపీ నేత దేవినేని అవినాష్ ఇంట్లో ఐటీ సోదాలు చేపట్టింది. అవినాష్ ఇంట్లో ఉదయం 6.30 నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
- వైసీపీ రాయలసీమ గర్జన సభకు స్పందన కరవు.. జగన్‌ను పొగిడేందుకే అని విమర్శలు
NO RESPONSE FOR SEEMA GARJANA : రాయలసీమ గర్జన సభను సీఎం జగన్‌ను పొగడటానికే పెట్టినట్లు వైసీపీ నేతలు వ్యవహరించారు. రాజకీయేతర ఐకాస నేతలూ చంద్రబాబును విమర్శించి.. అధికార పార్టీ నాయకుల మన్ననలు పొందే ప్రయత్నం చేశారు. న్యాయరాజధాని మినహా రాయలసీమ అభివృద్ధికి ఎలాంటి డిమాండ్లు సభలో లేవనెత్తక పోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.
- సంకల్ప సిద్ధి కుంభకోణంలో విస్తుపోయే కోణాలు.. కేవలం రిఫరల్ పాయింట్లతోనే
SANKALP SIDDHI UPDATE: పాయింట్లు ఆశ చూపారు.. గిఫ్ట్‌లు ఎరవేశారు.. అత్యాశతో ప్రభుత్వ ఉద్యోగులు సైతం సభ్యులుగా చేరారు. కమిషన్ల కోసం బంధువులను చేర్పించారు. సంకల్ప సిద్ధి స్కాంలో.. ఆర్టీసీ, విద్యుత్ ఉద్యోగులతోపాటు.. చాలా మంది పోలీసులు మోసపోయారు.
- నోటిఫికేషన్ వచ్చిందని సంబర పడేలోపే.. వయోపరిమితి అడ్డు
YOUTH WORRIED ABOUT AGE LIMIT IN POLICE RECRUITMENT : పోలీసు ఉద్యోగమే వారి కల. నోటిఫికేషన్ కోసం.. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. ఎన్నో ఏళ్ల ఎదురు చూపులకు తెరదించుతూ.. ప్రభుత్వం ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబర పడేలోపే.. వయోపరిమితి రూపంలో వారికి నిరాశ ఎదురైంది. సుమారు రెండు లక్షల మంది అభ్యర్ధులు ఇలాంటి వేదన అనుభవిస్తున్నారు.
- సీపీఎస్‌పై చర్చలకు ప్రభుత్వం పిలుపు.. ఈసారి పెట్టే మెలికపై ఆందోళనలో ఉద్యోగ సంఘాలు
CPS Meeting: సీపీఎస్ అంశంపై చర్చలకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలకు ఆహ్వానించింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో ఈ చర్చలు జరుగనున్నట్టు ఆర్ధికశాఖ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలకు, ప్రతినిధులకు ఆర్ధికశాఖ సమాచారం పంపింది.
- అభివృద్ధి పథంలో కశ్మీరం.. మూడంచెల వ్యూహంతో కేంద్రం ప్రగతి బాట..
ఉగ్రవాద కోరల్లో చిక్కుకొని దశాబ్దాలపాటు విలవిల్లాడిన కశ్మీర్ లోయ క్రమంగా ఊపిరిపీల్చుకుంటోంది. కేంద్రప్రభుత్వ విధానాల కారణంగా వీస్తున్న ప్రగతి సమీరాలతో సాంత్వన పొందుతోంది. ఒకప్పుడు విద్రోహశక్తుల వైపు ఆకర్షితులైన స్థానిక యువత.. నేడు క్రీడలు, కెరీర్‌పై దృష్టిసారిస్తూ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుంటోంది.
- ఉక్రెయిన్‌పై మాస్కో మరోసారి దాడి.. ముగ్గురు సైనికులు మృతి.. ఇల్లు, భవనాలు ధ్వంసం
ఉక్రెయిన్‌పై మాస్కో మరోసారి విరుచుకుపడింది. ఒడెశా, చెర్కసీ, క్రీవీ రిహ్ సహా పలు నగరాలపై జరిగిన ఈ దాడులు వల్ల ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం నిలిచిపోయిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
- మూన్‌లైటింగ్‌తో ఐటీ రంగంలో ఉద్యోగ భద్రత కరవు..!
ఇటీవలి కాలంలో ఐటీ రంగంలో 'మూన్‌లైటింగ్' తీవ్ర చర్చనీయాంశమైంది. ఒకే సమయంలో, లేదా విధులు ముగిసిన తరవాత వేరే ఉద్యోగం చేయడం దీని ఉద్దేశం. ఐటీ సంస్థలు ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఉద్యోగులు మాత్రం అదనపు నైపుణ్యాల కోసమో లేదా ఖర్చులు భరించలేక రెండో కొలువు చేస్తున్నట్లు చెబుతున్నారు.
- పాక్‌పై ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయం.. జీవం లేని పిచ్‌పై ఫలితం!
సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌దే పై చేయిగా నిలిచింది. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో బంతితో ప్రత్యర్థిని చుట్టేసిన ఇంగ్లీష్ జట్టు 74 పరుగుల తేడాతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
- 'రవితేజ నాకు గొప్ప నమ్మకాన్నిచ్చారు.. వందేళ్ల తర్వాత కూడా దీన్ని మర్చిపోను'
రవితేజ 'బెంగాల్ టైగర్' మూవీకి మంచి మాస్ మ్యూజిక్ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో. ఇప్పుడు మరోసారి మాస్ మహారాజ 'ధమాకా'కు కూడా స్వరకర్తగా వ్యవహరించారు. డిసెంబరు 23న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలోనే సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో భీమ్స్ ముచ్చటించారు. ఆ విశేషాలేంటంటే..