ETV Bharat / state

POLAVARAM: ధ్వంసమైన డయాఫ్రం వాల్‌పై ఎలా ముందుకెళ్లాలి?

పోలవరం ప్రాజెక్టులో ధ్వంసమైన డయాఫ్రం వాల్‌ అంశం పరిష్కారానికి దేశీ కంపెనీ బావర్‌ మూడు ప్రతిపాదనలను సూచించింది. దిల్లీ ఐఐటీ విశ్రాంత డీన్‌ వి.ఆర్‌.రాజు నేతృత్వంలోని కమిటీ కూడా దీనిపై దృష్టి సారించింది. ఐఐటీ నిపుణులు ఇటీవల పోలవరంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు.

polavaram
polavaram
author img

By

Published : Apr 28, 2022, 5:22 AM IST

పోలవరం ప్రాజెక్టులో ధ్వంసమైన డయాఫ్రం వాల్‌ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు వివిధ కమిటీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇందులో భాగంగా ఈ వాల్‌ను నిర్మించిన విదేశీ కంపెనీ బావర్‌ మూడు ప్రతిపాదనలు చేయగా.. దిల్లీ ఐఐటీ విశ్రాంత డీన్‌ వి.ఆర్‌.రాజు నేతృత్వంలోని కమిటీ కూడా దీనిపై దృష్టి సారించింది. ఐఐటీ నిపుణులు ఇటీవల పోలవరంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని స్వయంగా పరిశీలించారు. మరో వైపు కేంద్ర జలసంఘం నిపుణులు, డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ నిపుణులు కూడా పోలవరం సమస్యలపై దృష్టి సారించారు. తాజాగా వి.ఆర్‌.రాజు కమిటీ డయాఫ్రం వాల్‌ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు ...ప్రస్తుతం బయటకు కనిపిస్తున్న ధ్వంసమైన వాల్‌ కాకుండా...ఇంకా నీటిలోనే ఉన్న డయాఫ్రం వాల్‌ పరిస్థితి ఏమిటో తెలుసుకునేందుకు నీటి లోపల వీడియోలు చిత్రీకరించాలని సిఫార్సు చేశారు. అయితే గతంలోనే గజ ఈతగాళ్లను దింపి వీడియోలు తీయించాలనే ఆలోచన చేసినా అది అప్పటి నీటి ఉద్ధృతిని దృష్టిలో ఉంచుకుని ఈతగాళ్లు అంత సాహసం చేయలేదని తెలిసింది. ప్రస్తుతం నీటిలో ఉన్న డయాఫ్రం వాల్‌ను వీడియోతీసి పరిశీలించే అంశంపై దృష్టి సారించారు. మరో వైపు ఎంత మేర డయాఫ్రం వాల్‌ దెబ్బతిందో ఆ మేరకు సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించే అంశమూ చర్చల్లో ఉంది. ఇందుకు సంబంధించి కేంద్ర జలసంఘం ముందు బావర్‌ కంపెనీ మూడు ప్రతిపాదనలు ఉంచింది. ఇందులో సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించే విషయం కొలిక్కి వచ్చినా దానిపై లోతుగా పరిశీలన సాగుతోంది.

బావర్‌ మూడు ప్రతిపాదనలు ఇవి...

దిల్లీలో ఇటీవల జరిగిన సమావేశంలో బావర్‌ కంపెనీ ప్రతినిధులు మూడు ప్రతిపాదనలను నిపుణుల ముందుంచారు.

1. డయాఫ్రం వాల్‌ దెబ్బతిన్న మేర సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు. ఎగువన...దిగువన కూడా సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించి ప్రస్తుత డయాఫ్రం వాల్‌తో అనుసంధానిస్తారు. అంటే జాకెట్‌ రూపంలో నిర్మిస్తారు.

2. ప్రస్తుత డయాఫ్రం వాల్‌లో రెండు వైపులా ధ్వంసమైనంత మేర ఎగువనే ఒక స్థాయిలో డయాఫ్రం వాల్‌ నిర్మించి ప్రస్తుత డయాఫ్రంవాల్‌కు అనుసంధానించడం.

3.మొత్తం కొత్తగా పూర్తి డయాఫ్రం వాల్‌ నిర్మించడం..

ఆర్థిక విషయాలను దృష్టిలో ఉంచుకుని పెద్ద భారం పడకుండా ధ్వంసమైనంత మేర సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించే అంశంపై కసరత్తు సాగుతోంది. బావర్‌ కంపెనీ వీటికి సంబంధించిన డిజైన్లు రూపొందించి కేంద్ర జలసంఘానికి, డీడీఆర్‌పీకి సమర్పించనుంది.

డయాఫ్రం వాల్‌ సామర్థ్య పరీక్ష ఎలా?

ధ్వంసమైనంత మేర సమాంతర డయాఫ్రం వాల్‌ నిర్మించిన మిగిలిన డయాఫ్రం వాల్‌ సామర్థ్యం ఎలా ఉందో తేల్చాలని కేంద్ర జలసంఘం, డీడీఆర్‌పీ ప్రతినిధులు అడుగుతున్నారు. దాని సామర్థ్యం ఎలా అంచనా వేయాలో తమ వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని, ఎక్కడా ఇలా పరీక్షించిన సందర్భం లేదని బావర్‌ కంపెనీ ప్రతినిధులు ఈ సమావేశంలో వెల్లడించారు. దీనికి నిపుణులు రకరకాల ప్రతిపాదనలు వారి ముందు ఉంచినా అది సాధ్యం కాదని కూడా బావర్‌ కంపెనీ తిరస్కరించింది. తాజాగా ప్రొఫెసర్‌ వి.ఆర్‌.రాజు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ డయాఫ్రం వాల్‌ సామర్థ్యం తేల్చేందుకు గోదావరిలో నీటిలో ఉన్నంత మేర వీడియోతో చిత్రీకరించాలని సూచించింది. దీనికి కేంద్ర జలసంఘం, డీడీఆర్‌పీ ఆమోదం తెలియజేయాల్సి ఉంది.

ఇదీ చదవండి: POLAVARAM : పోలవరం డయాఫ్రం వాల్‌ విధ్వంసం... ఎవరిదీ వైఫల్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.