తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వద్దిపర్రులోని గ్రామ సచివాలయంలో వైఎస్సార్ పెన్షన్ కొత్త వెబ్సైట్ను రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి.రాజబాబు ప్రారంభించారు.
కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ ఇకనుంచి ఎంపీడివోలకు అప్పగించనున్నట్లు తెలిపారు. అర్హులకు కేవలం 5 రోజుల్లో పింఛన్ మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 8.75 లక్షల డ్వాక్రా గ్రూపులు ఉండగా అందులో ఉన్న 90 లక్షల మంది సభ్యులకు రూ.5 వేల కోట్లు రుణాలు అందించడం జరిగిందన్నారు. కొత్తగా 7.20 లక్షల పింఛన్లు మంజూరు చేయగా.. పెండింగ్లో ఉన్న 1.50 లక్షల పింఛన్లు ప్రస్తుతం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రంపచోడవరం ఏఎస్పీగా బిందుమాధవ్ నియామకం