తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం కొత్త మూలాపేట గ్రామానికి చెందిన సుగుణ అనే యువతి కాకినాడలోని ఓ కాల్ సెంటర్లో విధులు నిర్వహిస్తోంది. రోజూవారి విధుల్లో భాగంగా ఉదయం వెళ్లిన సుగుణ.. సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్లకుండా వంతెన పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
కొద్ది సేపటి తర్వాత మృతదేహం తేలుతుండటంతో గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: