ఎస్సీ, ఎస్టీలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయంటూ.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముసలి కన్నీరు కారుస్తున్నారని వైకాపా ఎమ్మెల్సీ పండుల రవీంద్ర వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ పండుల రవీంద్ర, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైకాపా నుంచి ఎస్సీలను వేరు చేయడానికి రాజకీయంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని పండుల రవీంద్ర అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై సంఘటనలు జరిగిన వెంటనే ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని... శిరోముండనం కేసులోనూ వెంటనే అధికారులను సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల మద్దతు జగన్ ప్రభుత్వానికే ఉంటుందని చింతా అనురాధ అన్నారు.
ఇవీ చదవండి..