Today's Crime News: రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక వైసీపీ నాయకుడు బూరాడ భవానీ శంకర్ (58) హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లాలో దారుణంగా ఓ వ్యక్తి చేసిన జంట హత్యలు కలకలం సృష్టించాయి. ఈ హత్యలకు వివాహేతర సంబంధమే కారణమని స్ధానికులు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక వైసీపీ నాయకుడు బూరాడ భవానీ శంకర్ హత్యకు గురయ్యాడు. ప్రకాశం జిల్లాలో కూడా అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అతి వేగంతో వచ్చి కారు ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న అక్కడిక్కక్కడే మరణించాడు. బాపట్లలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్దం అయింది. జరిగిన ప్రమాదంలో 30 వేల రూపాయల డబ్బు, జత చెవి కమ్మలు, ఉంగరం, స్కూటీ మంటల్లో కాలిపోయాయి.
YCP leader Killed: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక వైసీపీ నాయకుడు బూరాడ భవానీ శంకర్ (58) హత్యకు గురయ్యాడు. సంజీవయ్య నగర్‌లోని ఇంట్లో ఉన్న భవానీ శంకర్‌ను అజయ్ అనే యువకుడు పని ఉందని.. వెంటనే బయటకు రావాలని హడావుడి చేశాడు. ఇంట్లో నుంచి బయటకు రాగానే కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడు. నిందితుడి చేతిలో కత్తి చూసిన భవానీ శంకర్ భార్య ఆయన్ను హెచ్చరించింది. ఈలోగా నిందితుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ భవానీ శంకర్‌ను జీజీహెచ్‌కు ఆ తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భవానీ శంకర్ చిత్స పొందుతూ చనిపోయారు. ప్రస్తుతం 44వ డివిజన్ వైసీపీ ఇంఛార్జ్‌గా కొనసాగుతున్నారు. ఈయన మాజీ కార్పొరేటర్ కృష్ణ మాధురి భర్త. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Brutal Twin Murders: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కొద్దండ పనస గ్రామంలో మంగళవారం సాయంత్రం జంట హత్యలు సంచలనం కలిగించాయి కోదండ పనస గ్రామానికి చెందిన ఎర్రమ్మ (40), సంతోష్ (25)లను అదే గ్రామానికి చెందిన రామారావు అనే వ్యక్తి హత్యకు పాల్పడ్డాడు. సంతోష్ చెరువులో స్నానం చేస్తుండగా అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న ఎర్రమ్మను కూడా అదే కత్తితో హత్య చేశాడు. దీని వెనుక కారణాలు తెలియాల్సి ఉంది. అక్రమ సంబంధాలే కారణంగా స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న నరసన్నపేట సీఐ రాము సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
A Man Died In Road Accident: ప్రకాశం జిల్లా ముళ్ళమూరు మండలం రెడ్డి నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా దర్శి వైపు నుంచి వస్తున్న కారు రెడ్డి నగర్ వద్ద ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న కిలారి కోటేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ రోడ్డు మార్గంలో అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో దర్శి-శంకరాపురం మధ్య 9 రోడ్డు ప్రమాదాలు జరిగి నలుగురు చనిపోగా.. మరి కొందరికి కాళ్లు చేతులు విరిగాయి. ఇకనైనా ప్రభుత్వం త్వరలో చూసి సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Fire in house with short circuit: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దహనం కాగా కట్టుబట్టలతో కుటుంబం మిగిలిన సంఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలం చల్లారెడ్డిపాలెం పంచాయతీ జగన్నాధపురంలో చోటు చేసుకుంది... విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక పూరింట్లో మంటలు వ్యాపించాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ముగ్గురు చిన్నారులతో సహా భార్యాభర్తలు బయటపడ్డారు. జరిగిన ప్రమాదంలో 30 వేల రూపాయల డబ్బు, జత చెవి కమ్మలు, ఉంగరం, స్కూటీ మంటల్లో కాలిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు విచారణ చేపట్టారు. కట్టుబట్టలతో మిగిలిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కొండూరు గోవిందు కోరుతున్నారు.
ఇవీ చదవండి: