రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న వైకాపా ప్రభుత్వం... రైతుల్ని కులాల పేరుతో విభజించటం ఎంతవరకు సమంజసమని తెదేపా నేత జ్యోతుల నెహ్రూ ప్రశ్నించారు. రైతు భరోసా పథకం ద్వారా 12 వేల 500 ప్రతి రైతుకు అందిస్తామని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని మండిపడ్డారు. నిబంధనల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. రైతు భరోసా పథకం కింద కేంద్రం ఇచ్చే 6 వేలు కాకుండా..రాష్ట్ర ప్రభుత్వం 12 వేల 500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగ్గంపేట నియోజవర్గంలో రోడ్డు విస్తరణకు నిధులు సమీకరించుకొని అభివృద్ధి పనులు చేపట్టటంలేదని ఆరోపించారు. చిరు వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని సూచించారు.
ఇదీచదవండి