ETV Bharat / state

కరోనా ప్రభావం... కళ తప్పిన యానాం..! - యానాం పర్యాటకంపై కరోనా ప్రభావం

కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో భాగమైన యానాంలో పర్యాటక రంగం కుదేలైంది. తూర్పుగోదావరి జిల్లాకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం నిత్యం పర్యాటకులతో సందడిగా ఉండేంది. ప్రస్తుతం కరోనా వైరస్​ ప్రభావంతో కళ కోల్పోయింది.

Yanam tourism
Yanam tourism
author img

By

Published : Jun 3, 2020, 1:37 PM IST

Yanam tower
యానాం టవర్

కనుచూపుమేరంతా కొబ్బరి చెట్లు, గోదావరి నది నుంచి వచ్చే పిల్ల గాలులతో ఆహ్లాదకరంగా ఉంటుంది యానాం. తన అందాలతో పర్యాటకుల్ని ఆకర్షించే ఈ ప్రాంతం... ప్రస్తుతం కరోనాతో బోసిపోయింది. సెలవులు, పండగలు, వివాహ ముహూర్తాల సందర్భాల్లో వేల మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వంద అడుగుల ఎత్తైన యానాం టవర్... గోదావరి నదిలో విహారం... ప్రతి శని, ఆదివారాల్లో సాయంత్రం వేళ ప్రదర్శించే మ్యూజికల్ లైట్ లేజర్​ షో ఎంతగానో ఆకర్షించేవి. పర్యాటక శాఖకు రోజుకు రెండు లక్షల రూపాయల వరకు ఆదాయం సమకూరేది. ఇదంతా గతం... ప్రస్తుతం ఈ ప్రాంతాలన్నీ నిర్మానుష్యంగా మారాయి.

Yanam tourism
పర్యాటకులు లేక... బోట్లు ఇలా

కరోనా ప్రభావంతో మార్చి నెల 24 నుంచి అన్ని పర్యాటక ప్రాంతాలు మూతబడి యానాం పర్యాటకం కుదేలైంది. నిత్యం జన సంచారంతో కలకలలాడే ప్రదేశాలు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. యానాంకు పూర్వవైభవం ఎప్పుడు వస్తుందా అని అధికారులు ఎదురు చూస్తున్నారు.

ఇదీ చదవండి..

కొత్తగా 79 కరోనా పాజిటివ్‌ కేసులు..ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.