ETV Bharat / state

కుమారుడికి కరోనా... తండ్రిపై కేసు నమోదు - yanam covid update news

కరోనా కలవర పెడుతున్న వేళ... ఎవరు ఎక్కడ నుంచి వచ్చినా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పినా ఓ తండ్రి దాన్ని మరిచాడు. తన కుమారుడు హైదరాబాద్ నుంచి వచ్చినా అధికారులకు చెప్పలేదు. ప్రస్తుతం ఆ బాలుడికి కరోనా పాజిటివ్ రావటంతో... అతన్ని కొవిడ్ ఆసుపత్రికి తరలించారు. నిబంధనలు పాటించలేదని ఆ తండ్రిపై కేసు నమోదు చేశారు.

yanam police case files on father
కుమారిడికి కరోనా వస్తే తండ్రిపై కేసు నమోదు
author img

By

Published : Jun 22, 2020, 11:01 AM IST

Updated : Jun 22, 2020, 12:54 PM IST

హైదరాబాద్​ నుంచి యానాం వచ్చిన తన కొడుకు వివరాలు చెప్పనందుకు ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. సదరు వ్యక్తి కుమారునికి కరోనా పాజిటివ్​గా నిర్ధారణ కావడం వల్ల తండ్రిపై విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు యానాం ఇంఛార్జీ ఎస్పీ చోడిశెట్టి రాధాకృష్ణ తెలిపారు.

ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వచ్చినప్పుడు అధికారులకు సమాచారం ఇవ్వనందుకు తండ్రిపై చర్యలు తీసుకున్నట్లు ఇంఛార్జీ ఎస్పీ వివరించారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చేవారు తప్పనిసరిగా ఈ - పాస్‌ తీసుకుని ప్రభుత్వ అనుమతి పొంది రావాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

యానాంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు

Last Updated : Jun 22, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.