ETV Bharat / state

ఈటీవీ భారత్ కథనానికి స్పందించిన యానాం ప్రభుత్వం - yanam taja news

యానాంలో పారిశుద్ధ్య సంస్థకు బకాయిలు వెంటనే చెల్లించాలని కోరుతూ రెండువారాలుగా కార్మికులు విధులను బహిష్కరించి నిరసన తెలుపుతున్నారు. రోడ్లన్నీ చెత్తతో నిండిపోవటంపై 'ఈటీవీ భారత్' ప్రచురించిన కథనానికి ఆరోగ్యశాఖ మంత్రి స్పందించారు. త్వరలోనే బకాయి చెల్లిస్తామని చెప్పి కార్మికులను తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు.

yanam govt responce to etv bharth article  consult municipal workers

author img

By

Published : Jul 16, 2020, 8:57 AM IST

తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న యానంలో ఈ నెల ఒకటి నుంచి నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులపై 'ఈటీవీ భారత్​'లో వచ్చిన కథనానికి స్థానిక శాసనసభ్యుడు, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు తక్షణం స్పందించారు. పాండిచ్చేరి నుంచి యానం చేరుకున్న మంత్రి ఉదయం యానంలో రహదారులపై ఉన్న చెత్తను పరిశీలించారు.

18 ఏళ్లుగా యానంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్న ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ యాజమాన్యంతో మాట్లాడారు. యానం పారిశుద్ధ్యంపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామితో చర్చించామని, ప్రభుత్వం సంస్థకు బాకీ పడిన 80 లక్షలు చెల్లించేందుకు కొంత సమయం పడుతుందని తెలిపారు.

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తిరిగి విధుల్లోకి చేరాలని కోరారు. అంగీకరించిన ప్రజా సత్యం సేవా సంస్థ యాజమాన్యం తమ 300మంది సిబ్బందితో యానం పట్టణ.. గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న చెత్తను తొలగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.

సంబంధిత కథనం

డంపింగ్ యార్డులను తలపిస్తున్న యానాం వీధులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.