యానాంలో ఎన్నికల సందడి మొదలైంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమణ్ శర్మ.. యానాంలోని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సమావేశమయ్యారు. నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ... శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు. ఇప్పటినుంచే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఇండో టిబెటన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 90 మంది సాయుధ పోలీసులు.. యానాం సీఐ శివ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కలిసి పట్టణ ప్రాంతాల్లో కవాతు నిర్వహించారు.
ఇదీ చదవండి:
'పోటీకి ఎవరూ లేక.. తెదేపా అభ్యర్థులకే వైకాపా కండువాలు వేస్తున్నారు'