తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం లక్ష్మీపతిపురంలో భర్తను.. భార్య హత్యచేసింది. లక్ష్మీపతిపురం గ్రామానికి చెందిన విశ్వనాథపల్లి అప్పారావు, దేవి దంపతులకు పదేళ్ల వయసున్న కుమార్తె, ఎనిమిదేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నారు. ఆదివారం ఉదయం 10గంటల సమయంలో దేవి ఇనుప గొట్టంతో భర్త తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ఆమె నేరుగా కోరంగి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. తండ్రి హత్యకు గురికావడం, తల్లి పోలీసులకు లొంగిపోవడంతో.. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండీ.. సహజీవనంలో సమస్యలు.. రోడ్డు పైనే ఘర్షణ..