ETV Bharat / state

ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి - godavari flow in east godavari

తూర్పుగోదావరి జిల్లాలో వరద ప్రవాహం కొనసాగుతుంది. జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. సమాచార వ్యవస్థకు ఆటంకం లేకుండా శాటిలైట్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు.

ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి
author img

By

Published : Aug 16, 2020, 11:30 AM IST

Updated : Aug 16, 2020, 12:48 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమ గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో కొత్తపేట నియోజక వర్గంలోని లంక పొలాలు నీటమునిగాయి. లంక ప్రాంతాల్లో ఉండే కూరగాయల తోటలు నీటమునగడంతో రైతులు పడవలపై వెళ్లి కూరగాయలను రైతులు తెచ్చుకుంటున్నారు. ఇటుక బట్టీలు పూర్తిగా మునిగిపోయాయి. రావులపాలెం గోపాలపురంలోని గౌతమి వశిష్ఠ వంతెన వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది.

జిల్లాలోని 19 మండలాల్లోని గ్రామాలకు ముంపు ప్రమాదం ఉంది. దేవీపట్నం మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయు. గ్రామాల్లోకి వరదనీరు చేరటంతో గిరిజనులు కొండలపై ఉంటున్నారు. చట్టి, వీరాపురం వద్ద జాతీయ రహదారిపైకి వరదనీరు చేరింది. తెలంగాణ నుంచి ఏపీ మీదుగా ఛత్తీస్‌గఢ్‌ వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

సమాచార వ్యవస్థకు ఆటంకం లేకుండా శాటిలైట్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు అందుబాటులో ఉంచామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ బృందంతో పాటు కీలక శాఖల అధికారులతో 32 బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మన్యంలోని 49 మంది గర్భిణులను వైద్యశాలలకు తరలించినట్లు కలెక్టర్ చెప్పారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూముల ఏర్పాటు, సహాయక చర్యలకు లాంచీలు, మరబోట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఇవీ చదవండి

కోస్తాలో ఎడతెరిపి లేకుండా వాన.. పోలవరంలో నిలిచిన పనులు

Last Updated : Aug 16, 2020, 12:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.