Cheating: ఓ వాలంటీర్.. వృద్దురాలికి పింఛను ఇస్తూ.. ఆమె వేలు ముద్ర వేయించుకుని ఆస్తులు రాయించుకున్న ఘటన.. తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. కాకినాడ గ్రామీణ మండలం గంగనాపల్లిలో వాసంశెట్టి మంగాయమ్మ(75) తన కుమారుడు విశ్వనాథంతో కలిసి నివసిస్తోంది. మంగాయమ్మకు ప్రభుత్వ వృద్ధాప్య పింఛను అందుతోంది. వాలంటీర్ రవికుమార్ గత జనవరిలో పింఛను పెరిగిందని చెప్పి.. కొన్ని కాగితాలపై వేలిముద్రలు వేయించుకొని వెళ్లాడు. ఆ తర్వాత ఆస్తి జప్తు చేసినట్టు నోటీసులు రావడంతో.. తల్లీ కొడుకు ఖంగుతిన్నారు.
విశ్వనాథం భార్య సత్యవేణి కుటుంబ కలహాలతో వేరుగా ఉంటోంది. వైకాపా తరఫున ఎంపీటీసీగా గెలిచిందని.. ఆమె వాలంటీర్ ద్వారా తమ తల్లి వేలిముద్రలు వేయించుకుని ఆస్తి కాజేసిందని ఆయన ఆరోపిస్తున్నారు. కుల ధృవీకరణ పత్రం కోసమే వేలిముద్రలు వేయించుకున్నానని.. ఆస్తి కోసం కాదని వాలంటీర్ చెబుతున్నారు.
ఇదీ చదవండి:
పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య... ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనే కారణం!