తూర్పుగోదావరి జిల్లా లోవ కొత్తూరు వద్ద పోలవరం కాలువలో లభ్యమైన మృతదేహం ఇంటర్మీడియట్ విద్యార్థిదిగా గుర్తించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. ఇంటర్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ నెల 13న ఇంటి నుంచి బయటకొచ్చి పోలవరం కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చదవండి : ఇంటర్ పాస్ కాలేదని విద్యార్థి ఆత్మహత్య