ETV Bharat / state

మావోయిస్టులకు ఉచితంగా కొవిడ్​ చికిత్స.. - మావోయిస్టులకు వ్యాక్సినేషన్ ప్రక్రియ తాజా వార్తలు

కరోనా కల్లోలం నేపథ్యంలో మావోలు సైతం కొవిడ్ బారిన పడుతున్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్ర కాకముందే సరైన కాలంలో చికిత్స తీసుకోవాలంటూ పోలీసులు సూచిస్తున్నారు. అజ్ఞాత వాసం వీడి జనారణ్యంలోకి వచ్చి తగిన చికిత్స పొందలాని కోరుతున్నారు. మావోల ప్రాణాలకు తాము భరోసా కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.

'మావోయిస్టులూ ! ఉచిత కొవిడ్ టీకాను సద్వినియోగం చేసుకోండి'

author img

By

Published : May 11, 2021, 9:32 AM IST

విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని ‘ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ( ఏఓబీ ) పరిధిలో తిరుగుతున్న మావోయిస్టుల్లో చాలా మంది కొవిడ్‌ లక్షణాలతో బాధ పడుతున్నారని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది. గాలికొండ, కోరుకొండ, పెదబయలు, కటాఫ్‌ ఏరియాలో దళ సభ్యుల్లో కొందరు ఒళ్లు నొప్పులు, ఆయాసంతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది. కరోనా బారినపడిన వారికి సరైన సమయంలో, సరైన చికిత్స అందకపోవడం వల్ల చనిపోవడం చూస్తున్నాం.

వెంటనే సమాచారం ఇస్తే ఏర్పాట్లు చేస్తాం..

మావోయిస్టులుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ కరోనా లక్షణాలతో బాధపడుతుంటే, వెంటనే సమాచారం ఇస్తే ఉచితంగా చికిత్స అందేలా ఏర్పాటు చేస్తాం’ అని విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

హాయిగా ఇంటికి వెళ్లండి..

సరైన నిర్ణయం తీసుకుని మమ్మల్ని ఆశ్రయిస్తే మీ చికిత్సకు, మీ ప్రాణాలకు మాది భరోసా అంటూ హామీ ఇచ్చారు. కోలుకున్నాక మీరు, మీ కుటుంబ సభ్యులు హాయిగా ఇంటికి వెళ్లడానికి కూడా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి కూడా సోమవారం ఇదే తరహాలో విజ్ఞప్తి చేశారు.

ఇవీ చూడండి : 'రాష్ట్రాలకు నేరుగా కొవాగ్జిన్​ సరఫరా'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.