ETV Bharat / state

లంక భూముల నుంచి మట్టి తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు - మట్టి తరలిస్తున్న లారీలను అడ్డుకున్న మానేపల్లి గ్రామస్థులు

జాతీయ రహదారి పనుల పేరిట ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న లారీలను స్థానికులు అడ్డుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలో ఈ ఘటన జరిగింది. వైనతేయ గోదావరి ఏటిగట్టును నాశనం చేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

manepalli villagers stopped sand lorries, sand transportation stopped by villagers
మట్టి తరలింపును అడ్డుకున్న మానేపల్లి గ్రామస్థులు, లంక భూముల నుంచి మట్టి తరలింపు
author img

By

Published : Apr 18, 2021, 7:46 PM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం మానేపల్లిలోని వైనతేయ గోదావరి నది తీర లంక భూముల నుంచి ఇష్టానుసారంగా మట్టిని తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పనుల పేరుతో అనుమతులు తీసుకుని లంక మట్టిని దారి మళ్లిస్తున్నారంటూ.. ఈరోజు సాయంత్రం లారీలను స్థానికులు అడ్డుకున్నారు. అధిక లోడుతో లారీలు తిరగడంతో ఏటిగట్టు అధ్వానంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం- ముగ్గురు మృతి

ఈ విషయంపై నిర్వాహకులను ప్రశ్నిస్తుంటే.. దానికి డబ్బులు ఇచ్చారంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. వారు డబ్బులు ఎవరికి ఇచ్చారో స్పష్టం చేయాలన్నారు. దీనిపై ఉన్నత అధికారులు జోక్యం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: కే.ఏనుగుపల్లి అవుట్ ఫాల్ స్లూయిస్​కు మరమ్మతులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.